RGIA | శంషాబాద్ రూరల్, జూలై 13 : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కారులో మంటలు చెలరేగిన సంఘటన ఆదివారం జరిగింది. ఎయిర్‌పోర్టు అవుట్ పోస్టు సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి వచ్చిన వోల్వో కారు ఆదివారం ఉదయం 10.55 గంటలకు ఎయిర్‌పోర్టులోకి వచ్చింది. ఒక్కసారిగా కారులో మంటలు రావడంతో గమనించిన డ్రైవర్ కారులో నుంచి కిందకు దిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికే కారు ముందుభాగం దెబ్బతిన్నట్లు చెప్పారు. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆటు పోలీసులు, ఇటు ప్రజలు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.