
మేడ్చల్ మల్కాజ్గిరి : మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
మంటలు అంటుకుని ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మంటల నుంచి మరొకరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఫాట్లో నిల్వ చేసిన ఆయిల్ డబ్బాలకు మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్లో అక్రమంగా ఆయిల్ నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు.