
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైక్‌లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.