Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్, అందులోని ప్రయాణికులు.. క్షణాల్లో బయటకు దిగి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదం కారణంగా మాదాపూర్ – గచ్చిబౌలి రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.