హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ గేట్ -1 వద్ద శనివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్.. క్షణాల్లోనే కారు నుంచి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫైరింజన్‌తో పాటు అగ్నిమాపక సిబ్బందిని అక్కడ విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో కారులో చెలరేగిన మంటలను క్షణాల్లోనే ఆర్పేశారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ – టీఎస్ 09 ఈవీ 3423.