Nampally | హైదరాబాద్ : నాంపల్లి పటేల్ నగర్లో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. గోదాం చుట్టుపక్కల ఉన్న నివాసాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.