Hyderabad | చాంద్రాయణగుట్ట, మార్చి 7 : ఓ లారీ వర్క్ షాప్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.
బహదూర్‌పురా కిషన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఓ లారీ వర్క్ షాప్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. స్థానికులు అందించిన సమాచారంతో.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైరిజంన్ల సహాయంతో మంటలను ఆర్పేశారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న బహదూర్‌పురా ఎమ్మెల్యే మొబీన్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి కారణలను తెలుసుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాలలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.