Fire Accident in MGBS | హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మహబూబ్‌నగర్, గద్వాల వైపు వెళ్లే బస్సులు ఆగే ప్రాంతంలోని ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
భయంతో బస్సు దిగి ప్రయాణికులు పరుగులు తీశారు. అనంతరం ప్రయాణికులు బస్సు దిగి మంటలార్పే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది మంటలు వ్యాపించకుండా నీళ్లతో ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
ఎంజీబీఎస్‌లో గద్వాల డిపో ఆర్టీసీ బస్సుకు అగ్నిప్రమాదం
ఒక్కసారిగా బస్సు నుండి మంటలు చెలరేగడంతో, భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు pic.twitter.com/t90oQA9rCW
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026