Hyderabad | చార్మినార్, ఫిబ్రవరి 11 : అధికారుల్లో నమస్వయ లోపంతో స్థానికులకు సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అధికారులే విస్మయం చెందుతున్నారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం లేదని వాపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున దివాన్‌దేవిడి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో సుమారు రూ. 6 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారస్తులు తెలిపారు. పెద్ద ఎత్తున జరిగిన అగ్నిప్రమాద ఘనటపై రెవెన్యూ అధికారులకు కనీసం సమాచారం అందించలేదు. భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం మీడియా ద్వారా మాత్రమే మాకు తెలిసిందని బహదూర్‌పుర తహసీల్దార్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే మీర్ జుల్పీకర్ అలీ, కార్పోరేటర్ సోహెల్ ఖాద్రీతో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం వరకు కూడా జీహెచ్ఎంపీ టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలించలేదని స్థానికులు తెలిపారు.