హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఒక ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ షోరూంలో బైకుల బ్యాటరీలు పెద్ద శబ్దాలు చేస్తూ పేలుతుండటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. షోరూం పైన ఉన్న లాడ్జి వైపు మంటలు ఎగసిపుడుతున్నాయి. చాలా ఎలక్ట్రిక్ బైకులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ షోరూం పైఅంతస్తులో ఉన్న లాడ్జిలో కొంతమంది టూరిస్టులు చిక్కుకుపోయారు.
వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. లాడ్జిలో దట్టంగా పొగలు అలుముకోవడంతో లోపలి వారు చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.