Hyderabad | హైదరాబాద్ శివారు కాటేదాన్ టాటానగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.