హైదరాబాద్: హైదరాబాద్లోని కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీలో ఉన్న ఫ్యాబ్రికేషన్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాపు మొత్తానికి విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో.. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో అగ్రిప్రమాదం జరిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.