పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro waste management) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి. సిగాచి పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటన మరువకముందే మరో ప్రమాదం జరగడం గమనార్హం. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో లారీ, జేసీబీ దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.