Hyderabad | హైదరాబాద్ : చర్లపల్లి పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న శేషసాయి రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నికీలలు పక్కనే మహాలక్ష్మి రబ్బర్ కంపెనీనికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ దట్టంగా కమ్ముకుంది. రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఫేస్ 1లో ఓ కంపెనీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
ఇతర కంపెనీలకు లకు అంటుకున్న మంటలు
మంటలు చెలరేగడంతో భయాందోళనలో స్థానిక ప్రజలు
రహదారి పక్కనే ఉండడంతో దట్టంగా కమ్ముకున్న పొగలు pic.twitter.com/f4WL6TRqH5
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2025
ఇవి కూడా చదవండి..
Hyderabad | ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు ఆ జోలికే వెళ్లరేమో!
Hyderabad | ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పడినా తప్పని పార్కింగ్ తిప్పలు.. ఆందోళనలో దుకాణదారులు
Hyderabad | బిడ్డ పెండ్లి కోసం ఫైనాన్స్‌లో రుణం.. దళారీ మోసంతో కుటుంబం ఆత్మహత్యాయత్నం