హైదరాబాద్లోని చాదర్ఘాట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 40 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఫుట్పాత్ దగ్గర వేసుకొని ఉన్న గుడిసెల్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం ధాటికి గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి. దీంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగి పక్కపక్కనే ఉన్న 40 గుడిసెలు దగ్ధం అయ్యాయి. సిలిండర్లు పేలడంతో గుడిసెల దగ్గర ఉన్నవాళ్లు, పక్కనే ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. భారీ అగ్ని ప్రమాదం వల్ల గుడిసెల్లోని నిత్యావసర వస్తువులు, ఇతర సామాన్లు కాలి బూడిదైపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేసింది.
చాదర్ఘాట్లో భారీ అగ్నిప్రమాదం.. 40 గుడిసెలు దగ్ధం.. అగ్ని ప్రమాదం ధాటికి పేలిన సిలిండర్లు.. కాలి బూడిదైపోయిన గుడిసెల్లోని వస్తువులు, ఇతర సామాగ్రి pic.twitter.com/OOkTc6eDOo
— Kamal (@itsmekkprasad) December 31, 2021