హైదరాబాద్ : బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇంద్రానగర్ సమీపంలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి 8 గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటానస్థలికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాణ నష్టం సంభవించకపోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
8 గుడిసెలకు చెందిన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. బాధితుల రోదన ప్రతి ఒక్కర్నీ కలిచి వేసింది. కష్టపడి సంపాదించిన నగదు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో బోరున విలపించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు.