గోల్నాక, జూలై 1: పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఆర్థిక చేయూతనందిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దాదాపు నాలుగున్నర ఏండ్ల కాలంలో మొత్తం రూ.10.20కోట్ల ఆర్థిక చేయూత నందించామని తెలిపారు. అందులో 1586 మంది లబ్ధిదారులకు రూ.8కోట్ల 20 లక్షలు కాగా..122 మంది ఎల్వోసీ లబ్ధిదారులకు రూ.2.6 కోట్ల ఆర్థిక సాయం అందజేశామని అన్నారు. శనివారం గో ల్నాక క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.3.28 లక్షల విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై ద వాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆపత్కాలంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా క్యాంపు కార్యాలయం లో సంప్రదించాలని ఆయన కోరారు. కార్యాలయం అధికారులు దగ్గరుండి అన్ని వివరాలు తీసుకొని సులువుగా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారన్నారు. ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపుతూ వీలైనంత త్వరగా బాధితులకు చెక్కులు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్ పేటలో పాదయాత్ర ..
స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్ పేట డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. శుక్రవారం ఉదయం ప్రేమ్‌నగర్‌లో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో పాటు పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి డివిజన్ల వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ తమ దృష్టికి వచ్చి న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.