జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బాతులాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అప్పన్నంగా దక్కించుకునేందుకు మాస్టర్ స్కేచ్ వేశారు. ప్రభుత్వంలోని ముఖ్య నేత కార్యాలయం డైరెక్షన్లో వ్యూహా రచన చేసి చకచకా అడుగులు వేస్తున్నారు. జీవో నంబరు 68కి విరుద్ధంగా నిర్వహణ ముసుగులో ఎల్ఈడీ ప్రకటనల పేరుతో సొంత గల్లా పెట్టెను నింపుకొనేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇందులో బల్దియా పెద్ద ఒకరు, ‘ముఖ్య’ నేత కోటరీలోని మైనార్టీ నేత చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే ఎల్ఈడీ ప్రకటనలతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక మినహాయింపులు పొందిన యాడ్ ఏజెన్సీలతో గ్రేటర్‌లోని 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పంచుకునేందుకు లోపాయికారి ఒప్పందంతో ముందుకువెళ్తున్నారు. 10 ఎఫ్‌వోబీలు కావాలంటూ బల్దియా పెద్ద ఒకరు ప్రతిపాదన పెట్టగా, మైనార్టీ నేత ఐదు, మిగిలిన యాడ్ ఏజెన్సీలు పంచుకునేందుకు అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎఫ్‌వోబీల నిర్వహణ, జీవో 68 నుంచి మినహాయింపుతో ఎల్ఈడీ ప్రకటనలకు సంబంధించిన దస్ర్తాన్ని ఆగమేఘాల మీద స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకురావడం, అప్పటి వరకు ఏజెండాలో లేని ఈ అంశాన్ని టేబుల్ ఐటెంగా చేర్చి మరీ సభ్యులతో ఆమోద ముద్ర వేయించడం గమనార్హం.
ప్రస్తుతం నిర్వహణ పేరిట ప్రైవేట్ పరం చేసే ఎఫ్‌వోబీల దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ముందస్తు అవగాహన ప్రకారం తెరమీదకు టెండర్ల ప్రక్రియ నడిపించి, అస్మదీయులకే ఈ ఎఫ్‌వోబీలను కట్టబెట్టేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారన్న ప్రచారం జోరుగా వినిపిస్తున్నది. ఆర్థిక కష్టాల్లో ఉన్న బల్దియాలో ఆదాయ మార్గాలను పెంచుతూ, వ్యవస్థాగత బలోపేతానికి కృషి చేయకుండా పప్పు బెల్లం తరహాలో జీహెచ్ఎంసీ ఖజానాను కొల్లగొట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు రాజకీయ పెద్దలు సిద్ధం కావడం గమనార్హం.
– సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్లో పాదచారుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ 72 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టాలని నిర్ణయించి దశల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. అందుబాటులోకి వచ్చిన చోట జీహెచ్ఎంసీ నిర్వహణ చేపడుతున్నది. ఏటా ఒక్కో ఎఫ్‌వోబీకి నిర్వహణ పేరిట దాదాపుగా రూ.12 నుంచి 15 లక్షల మేర ఖర్చు చేస్తున్నది. నిర్వహణ భారం అవుతున్నప్పుడు జీహెచ్ఎంసీ జీవో నం 68 ప్రకారంగా ప్రకటనలకు అవకాశం కల్పించి ముందుకు వచ్చిన ఏజెన్సీల నుంచి ఫీజులను వసూలు చేసుకునే అవకాశం ఉంది. కానీ అధికారులు ఎఫ్‌వోబీలను ప్రైవేట్ వ్యక్తులు(యాడ్ ఏజెన్సీ)లకు నిర్వహణ పేరిట కట్టబెడుతున్నారు.
కాగా, గ్రేటర్లో ప్రకటన బోర్డు ఎత్తు భూమి నుంచి 15 అడుగుల లోపే ఉండాలనే నిబంధన జీవో నం 68 స్పష్టం చేస్తున్నది. కానీ ఈ 23 ఎఫ్వోబీలకు ఈ జీవో వర్తించదని, ఎత్తు విషయంలో నిబంధన నుంచి మినహాయింపునకు ప్రతిపాదన పెట్టారు. దాదాపు ఎఫ్వోబీలన్నీ 15 అడుగుల ఎత్తు వరకు ఉండగా, ఆపై ఎల్ఈడీ బోర్డులు దర్శనం ఇవ్వనున్నాయి. మరో ఉల్లంఘన విషయానికొస్తే గ్రేటర్లో ఎల్ఈడీ ప్రకటనలు నిషేధం. అవసరమైతే హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఎల్ఈడీ ప్రకటనలు అనుమతించాలి. కానీ ఇక్కడ ఇవేం నిబంధనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా వెళ్తుండగా, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి చేర్చిన తీరు చర్చనీయాంశంగా మారింది.
స్టాండింగ్ కమిటీలో లేని ఏజెండాను టేబుల్‌గా ఐటెంగా చేర్చి సుదీర్ఘ చర్చ లేకుండా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం గమనార్హం. ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వద్ద ఎఫ్వోబీ, ఎంజే మార్కెట్ వద్ద పేరొందిన యాడ్ ఏజెన్సీకి నిర్వహణ ముసుగులో అప్పన్నంగా చదరపు మీటర్‌కు వార్షికంగా రూ. 5500/- ఫీజును నిర్ణయించి కట్టబెట్టారు. దీంతో ఒక ైస్లెడ్ ప్రకటనకు దాదాపు రూ. 6 లక్షల మేర ఏజెన్సీ వాణిజ్య, వ్యాపార సంస్థల నుంచి వసూలు చేస్తున్నారు. పది ైస్లెడ్లు, అందులో రెండు వైపులా కలిపి నెలకు దాదాపుగా రూ. కోటి మేర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కానీ బల్దియాకు మాత్రం వార్షికంగా రూ. లక్షల్లో మాత్రమే ఫీజులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలోనే 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు చేరుతున్నాయి. ఈ ఎఫ్వోబీలపై