Chanchalguda jail | హైదరాబాద్ : హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య చెలరేగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు జైలు లోపల, బయట హైఅలర్ట్ ప్రకటించారు. దస్తగిరి అనే ఖైదీ.. రౌడీ షీటర్ జాబ్రీపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన జాబ్రీని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇక వీరిద్దరి ఘర్షణతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దస్తగిరి, జాబ్రీల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ఇవాళ జైల్లో దాడి చేసుకున్నట్లు సమాచారం. రౌడీ షీటర్ జాబ్రీ ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.