Hyderabad | మీర్‌పేటలో కారు డ్రైవర్ అరాచకం.. వ్యక్తిని కారు బానెట్‌పై 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం : వీడియో
మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ అరాచకానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ అరాచకానికి పాల్పడ్డాడు. బైక్‌పై వెళ్తున్న తండ్రి, కొడుకును కారుతో ఢీ కొట్టడమే కాకుండా కారు బానెట్‌పై బాధితుడిని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. తన కారుకి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు. అయితే బాధితుడు కారు బానెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. దీంతో అతన్ని అలాగే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. మిగతా వాహనదారులు ఈ దుర్ఘటనను వీడియో తీయడంతో ఈ దారుణం భయటపడింది.
వివరాల్లోకి వెళ్తే..ఎస్.కె. జిలానీ, అతని కుమారుడు ఫైసల్ ఇద్దరు గాయత్రీ నగర్ నుండి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా ఒక కారు వారిని వెనుక నుండి ఢీకొట్టింది. ఇద్దరిమధ్య వాగ్వాదం చెలరేగి గొడవకు దారితీసింది. దీంతో కారులో ఉన్న వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ దాదాపు వాహనాన్ని ఆపకుండా దాదాపు రెండు కిలోమీటర్ల పాటు కారు బానెట్‌పై ఉన్న అతడిని ఈడ్చుకుపోయాడు.
అతడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించాడు. ఆ కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, వెనక్కి తిరిగి, చివరకు మండమల్లమ్మ జంక్షన్ సమీపంలో స్థానికులు అడ్డగించడంతో పట్టుబడినట్లు సమాచారం.ఈ ఘటనలో బాధితుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగిపోయి ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు
కారుతో ఢీకొట్టడమే కాకుండా తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఉన్మాదంగా మారిన టాక్సీ కారు డ్రైవర్
తన కారుకి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు.. అయితే బాధితుడు కారు బోనెట్ పట్టుకుని అలాగే… pic.twitter.com/qOK9CDi7R0
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

