Runa Mafi | మేడ్చల్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షల మారింది. రుణమాఫీ అందని వారు గ్రీవెన్స్ సెల్లను ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండాపోవడంతో రైతులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 24 గ్రీవెన్స్ సెల్లను ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు.. ఒక్కటంటే ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 600 పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నా.. వేల సంఖ్యలో అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నదాతలు మండిపడుతున్నారు.