సుల్తాన్‌బజార్: రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు మత్స్య రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ మత్య్స రైతుల ఉత్పత్తి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం ప్రశ్నించారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని మత్య్స భవన్ ముందు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మత్య్స రైతులతో కలిసి అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్ల మత్య్స రైతులు సరఫరా చేసిన చేపల బిల్లులను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 75 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 34 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క రూపాయి చెల్లించ లేదన్నారు.