Falaknuma | చార్మినార్, మార్చి 8: ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకువస్తున్న ఆధునిక సాంకేతికతో అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిపోతుందని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫలక్‌నుమా డిగ్రీ కాలేజీలో మహిళా సాధికారత, భద్రత అంశాలపై ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యకమాన్ని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా ప్రారంభించారు.
అనంతరం ఎస్ఐ హసీనా మాట్లాడుతూ.. నేటి సమాజంలో అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటూ జీవితంలో పైకి ఎదగాలని సూచించారు. అన్ని రంగాల్లో నేడు పోటీ పెరిగిపోతుందని, మహిళలు సైతం పురుషులతో పోటీపడుతూ విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఆధునిక సాకేంతికతను మేలవిస్తూ ఇష్టమైన్న వృత్తిలో రాణించాలని తెలిపారు.
సోషల్ ఇనిషియేటివ్స్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ద్విచక్ర వాహన డ్రైవింగ్‌లో శిక్షణ అందించామని సంస్థ సీఈఓ నాగరాజు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ద్విచక్ర వాహనాలను స్వతంత్రంగ నడిపేందుకు, వారిలో నైతిక దైర్యం నింపేందుకు ఈ శిక్షణ సహాయపడిందని నాగరాజు తెలిపారు. గమ్యం చేరుకోవడానికి ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తుంటాం. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అంతే శ్రద్ధతో అడుగులు వేయాలని ఫలక్ నుమా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సోషల్ ఇనిషియేటివ్స్ సీఈఓ జయ భారతి, మహిళా సాధికారత సెల్ కో ఆర్డినేటర్ జె. పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.