IT Jobs | సిటీబ్యూరో: హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద మూడు నుంచి ఆరునెలల పాటు శిక్షణ పొందితే ఆయా సంస్థల్లో జాబ్ గ్యారెంటీ అంటూ పలు కన్సెల్టెన్సీలు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాయి. శిక్షణ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 నుంచి 3లక్షల ఫీజు వసూలు చేసి కోట్లు దండుకున్నాక పత్తా లేకుండా పోతున్నాయి. నిరుద్యోగులు ఈ కంపెనీల మాటలు నమ్మి సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కట్టి నెలల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసి తీరా వారు మోసం చేశాక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఏడాదిలో 20కి పైగా కేసులు..
నగరంలో బోగస్ కంపెనీల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. వీటి విషయంలో తీరా మోసపోయిన తర్వాత బాధితులు పోలీసులకు చెప్పడంతో ఒక్క ఏడాదిలో సుమారు 20కిపైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీలపై కఠినమైన కేసులు పెట్టడంతో పాటు వారు భవిష్యత్ లో వ్యాపారం చేయకుండా నిషేధించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరంలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల వివరాలు సేకరిస్తున్నారు. గతంలో నకిలీ కన్సల్టెన్సీ కేసుల్లో జైలు పాలైన కొందరు నిందితులు తిరిగి కంపెనీలు పెట్టి మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఇటీవల జరిగిన సంఘటనలివే..!