హైదరాబాద్: జనాల రద్దీ అధికంగా లేని ఏటీఎంలే (ATM) లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు.. తాజాగా రాజేంద్రనగర్‌లోని ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. రాజేంద్రనగర్‌లోని మధుబన్ కాలనీలో ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దుండగులు.. అందులోనుంచి డబ్బు రాకపోవడంతో పెట్రోల్ పోసి మిషన్‌కు నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న రూ.7 లక్షల విలువైన నగదు కాలిబూడిదైంది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దుండగులకు గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగల కోసం ఎస్వోటీ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మైలాద్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.