చర్లపల్లి, జూన్ 6 : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, బీఆర్ఎస్ నాయకులు, స్థానికులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రైల్వే టెర్మినల్‌కు వచ్చే రహదారి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రైల్వే టెర్మినల్‌కు వచ్చే ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ స్థలం కల్పించాలన్నారు. రైల్వే టెర్మినల్‌లో సరైన వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైల్వే టెర్మినల్, పరిసర ప్రాంతాలలో విధిదీపాల నిర్వహణను మెరుగుపర్చాలన్నారు. ఇటీవల గాలివానకు దెబ్బతిన్న టెర్మినల్ పైకప్పు మరమ్మతు పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.