సుల్తాన్‌బజార్, జనవరి 31: నుమాయిష్‌లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 83వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్-2024ను ఎగ్జిబిషన్‌ను ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్ వనం, సొసైటీ కార్యదర్శి హన్మంతరావు, సంయుక్త కా ర్యదర్శి చందర్జిత్సింగ్, కోశాధికారి రాజేందర్‌కుమార్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి రాజేందర్ నాగులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
‘కళలకు కాదేది అనర్హం, చిత్ర కారుడి కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం ఓ అత్యద్భుతం’ అని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్ వనం అన్నారు. ఈ ఏడాది కూడా ప్రదర్శనలో మొత్తం 81 మంది కళాకారులు తమ చిత్రాలను ఏర్పాటు చేశారని, వీరిలో అత్యుత్తమ ప్రతిభ, ఆకట్టుకుంటున్న 21 చిత్రాలను ఎంపిక చేసి బహుమతులు అందజేసినట్లు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆర్ట్ ఎగ్జిబిషన్ సబ్ కమిటీ సలహాదారులు కవితా వనం, అశ్విన్ మార్గం, కన్వీనర్ హనుమంతరావు దేవులపల్లి, జాయింట్ కన్వీనర్లు ఉమారాణి, పద్మజ తదితరులు
పాల్గొన్నారు.