సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.483గ్రాముల గంజాయితోపాటు రెండు సెల్ఫోన్లు, ఆటో సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే… దుంప శ్రీనివాస్, కావేటి విజయ్‌కుమార్ ఆటోలో తిరుగుతూ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు బాలానగర్ మిథాని రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న నిందితులిద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 331గ్రాముల గంజాయితో పాటు ఆటో, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం కేసును బాలానగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తెలిపారు.
ధూల్‌పేటలోని జిన్సీచౌరాయి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న నరేందర్ సింగ్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1.152 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గంజాయి విక్రయాలకు సహకరిస్తూ పరారీలో ఉన్న విజయలక్ష్మి, బిజిమాది బాయిలపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి తెలిపారు.