హైదరాబాద్ : గంజాయి, మద్యం అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) సూచించారు. తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ శాఖ గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ (Diary) ని గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కోటిక్స్ నియంత్రణకు(Controlling narcotics) బహుముఖ వ్యూహం అవలంబించడంతో పాటు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, నైపుణ్యతను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ శాఖ గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జే. హరికృష్ణ, జనరల్ సెక్రటరీ సీహెచ్. విజయ్, ట్రెజరర్ డి. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కృష్ణ ప్రియ తదితరులు పాల్గొన్నారు.