సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): అతనో మద్యం వ్యాపారి….దాదాపు 8 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా టెండర్లలో మద్యం షాపులను దక్కించుకుంటూ వ్యాపారం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు 2023లో జరిగిన మద్యం టెండర్లలో అతడికి మద్యం షాపు దక్కలేదు.
దీంతో సదరు వ్యాపారికి ఢిల్లీలో ఉన్న పరిచయాలతో గుట్టుచప్పుడు కాకుండా నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులతో చేతులు కలిపి పెద్ద ఎత్తున అక్కడి నుంచి విదేశీ మద్యాన్ని నగరానికి స్మగ్లింగ్ చేస్తూ, మద్యం షాపు దక్కని లో టును తీర్చుకుంటున్నాడు. ఈ ఎన్ఫోర్స్మెంట్ దాడు లు నిర్వహించి.. ఇద్దరిని అరెస్ట్ చేసి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ కథనం ప్రకారం…నగరంలోని దోమలగూడకు చెందిన హరీశ్ కుమార్ హిర్వాణి మద్యం వ్యాపారి. దాదాపు 8సంవత్సరాలకు పైగా కోఠిలో న్యూసిటీ పేరుతో మద్యం దుకాణం నిర్వహించా డు. అయితే 2023లో జరిగిన మద్యం షాపుల టెండర్లలో హరీశ్ మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రూ.20లక్షలు ఖర్చుచేసి.. వేర్వేరుగా 10దరఖాస్తు లు వేశాడు. అయినా అతడికి మద్యం షాపు దక్కలేదు.
దీం తో తీవ్ర అసంతృప్తికి గురైన హరీశ్.. ఏలాగైన మద్యం షాపు దక్కని లోటును తీర్చుకోవాలని నిర్ణయించుకున్నా డు. అందుకోసం ఢిల్లీలో తన కు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని అక్కడి నుంచి పెద్ద ఎత్తున విదేశీ మద్యంను గూడ్స్ వాహనాల్లో నగరానికి తెప్పిస్తున్నాడు. వాటిని నగరంలోని బషీర్‌బాగ్, కేఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న తన టాటా వాటర్ గోదాంలో నిల్వచేసి, పరిచయమున్న వారికి విక్రయిస్తున్నాడు.
ఒక్కో విదేశీ మద్యం బాటిల్‌పై కనీసం రూ.2వేల లాభం వచ్చే విధంగా చూసుకుని మార్కెట్ ధరకంటే తక్కువగా విక్రయిస్తుండడంతో చాలా మంది హరీష్ వద్ద విదేశీ మద్యం కొనుగోలు చేస్తున్నారు. నిందితుడు దాదాపు 14నెలలుగా ఈ దందా నడుపుతున్నాడు. మద్యం దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ తన బృందంతో కలిసి శనివారం బషీర్‌బాగ్‌లోని కేఫ్ బహార్ రెస్టారెం ట్ సమీపంలో ఉన్న టాటా వాటర్ ఏజెన్సీ గోదాంపై దాడులు జరిపారు.
ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు హరీష్‌కుమార్ హి ర్వాణి, సికింద్రాబాద్‌కు చెందిన విలియమ్స్ జోసెఫ్‌లను అరెస్ట్ చేసి, గోదాంలో నిలువ ఉంచిన 24రకాల 233 ఢిల్లీ ఫారిన్ లిక్కర్ బాటిళ్ళతో పాటు కారు, రెండు సెల్ఫోన్లు, రూ.35వే ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రధాన నిందితుడికి విదేశీ మద్యం సరఫరా చేస్తున్న ఢిల్లీకి చెందిన మ ద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్‌లపై కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శ్రాస్తి, ఎన్ఫోర్స్మెంట్ ఏసీ అనిల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ శీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సాయికుమార్, ప్రసాద్, గోపాల్, నవీన్, తరుణి,రాజ్ ఠాకూర్లను ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.