సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.62 లక్షల విలువ చేసే 27 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన సుశీల్‌కుమార్ ఉపాధి కోసం నగరానికి వలసొచ్చి, చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగించాడు. అయితే, వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో తిరిగి స్వరాష్ర్టానికి వెళ్లిపోయాడు.
అక్కడ బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేసే ప్రవీణ్‌సింగ్ రాయ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న సుశీల్‌కుమార్.. బెంగళూరు వెళ్లి ప్రవీణ్‌సింగ్ వద్ద ఎండీఎంఏ డ్రగ్‌ను రూ.3,000కు గ్రాము చొప్పున కొనుగోలు చేసి, నగరంలో రెట్టింపు ధరకు విక్రయించసాగాడు. నగరంలో సుశీల్‌కుమార్ వద్ద నుంచి గ్రాముకు రూ.5,000కు చొప్పున రమేశ్, చరణ్ కొనుగోలు చేసి, స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆబ్కారీ అధికారులు డ్రగ్స్ విక్రయిస్తున్న సుశీల్‌కుమార్, దీపక్‌ను అరెస్టు చేసి, విచారించగా.. హితేష్, షేక్ మహ్మద్, బాబీకి డ్రగ్స్ విక్రయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి రూ.1.62లక్షల విలువ చేసే 27 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.