Talasani Srinivas Yadav | హైదరాబాద్ : భారీ వర్షాలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాంగోపాల్ పేట డివిజన్లోని కాచిబౌలి, నల్లగుట్ట, జూలమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపునీరు చేరి సామాగ్రి తడిసిపోయి తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలవనున్నట్లు తెలిపారు. ఈ నెల 21 వ తేదీన ఉదయం 9.00 గంటల నుండి ఆయా ప్రాంతాలలో 1500 బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బియ్యం, పప్పు, నూనె తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. బాధిత కుటుంబాలకు సరుకుల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, టి. మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, లక్ష్మీపతి, ప్రవీణ్ రెడ్డి, ఏసూరి మహేష్, శ్రీహరి, నాగులు, సురేష్ గౌడ్, కిషోర్, ఖలీల్, అశోక్ యాదవ్, పీయూష్ గుప్తా, కట్టా బలరాం, శేఖర్, గోపిలాల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
24న పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ
ఈ నెల 24 వ తేదీన పీపుల్స్ ప్లాజాలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకలను సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా నేతలతో కలిసి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని పూజించే పండుగ, మహిళలు జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజిని సాయిచంద్, సుశీలారెడ్డి, సుమిత్రానంద్, శ్రీదేవి, రజితా రెడ్డి, నిర్మల తదితరులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ప్రత్యేకంగా సమావేశమై బతుకమ్మ ఏర్పాట్లపై చర్చించారు.