సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ ) : అగ్ని ప్రమాదాలపై చిన్నారులకు అవగాహన కల్పిస్తే వారి జీవితకాలం భద్రతా నైపుణ్యాలు అలవర్చుకుంటారని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఈవీడీఎం ఆధ్వర్యంలో టోలిచౌకిలో పోడియం మాల్, సంతోష్‌నగర్ సాయి డిగ్రీ కాలేజీ, సరూర్‌నగర్ త్రివేణి స్కూల్, కూకట్పల్లి పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, బేగంపేట ఐడీఎఫ్సీ బ్యాంక్ బిల్డింగ్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఆరు జోన్ల పరిధిలో వారానికొకసారి ఒక్కో జోన్లో మాక్ డ్రిల్ చేపడుతున్నామన్నారు. ఆయా వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలో మాక్ డ్రిల్ అవసరం అనుకుంటే 040-2955 5500, మొబైల్ నంబరు 9000113667లకు ఫోన్ చేయొచ్చని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి సూచించారు.