హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించే పేదలకు వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి హౌసింగ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద ప్రజల కోసం నిర్మించిన 22 డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో బస్తీ దవాఖానాలు, అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిందే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం అన్నారు. ఈ నెల 15 న బండ మైసమ్మ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.