మేడ్చల్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి జిల్లా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ప్రధానంగా సీతారాంనగర్ కాలనీలో సర్వే నంబర్లు 109, 111లపై ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న అక్రమ దావాలు, ప్రజలపై వేధింపులను అరికట్టాలని, నిషేధిత ఆస్తుల జాబితాలో వక్ఫ్ బోర్డు పేరుతో తప్పుగా నమోదైన లీగల్ హౌస్ ఆస్తులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మను చౌదరికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి వివరించారు.
మల్కాజిగిరిలో ప్రభుత్వ జనరల్ హస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విమలాదేవీ నగర్‌లోని ప్రజా వినియోగ భూమి జరుగుతున్న అక్రమ, ఆక్రమణలు అనధికార నిర్మాణాలను వెంటనే ఆరికట్టాలని, ఆర్కేపురం ఆర్ఓబీ, ఆర్యూబీ పనులు వల్ల ప్రభావితమైన 18 మంది బీపీఎల్ పేద కుటుంబాలకు 2బీహెచ్‌కే ఇండ్లను కేటాయించాలని, కౌకుర్ దర్గా నుంచి బిట్స్ పిలానీ వరకు వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలంటూ.. మర్రి రాజశేఖర్‌రెడ్డి వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్, చింతల శాంతిశ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.