విస్తృతంగా తనిఖీలు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
- రూ. 13.72 కోట్ల నగదు సీజ్.!
సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రూ.13.72 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. కోటి 88 లక్షల విలువజేసే ఇతర వస్తువులు, 20,090 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు. 167 కేసులు నమోదు చేసి, 161 మందిని అరెస్టు చేశామన్నారు. నగదు, ఇతర వస్తువులపై 340 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్కరించామన్నారు. 221 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, 2,686 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేశారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. తాజాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.26.91 లక్షల నగదు, రూ. 33,839 విలువైన వస్తువులను పట్టుకొని, సీజ్ చేసినట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

