హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల విజేతల వివరాలను మంగళవారం ప్రకటించారు. ఇద్దరు సభ్యుల(తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్‌రెడ్డి, ఈనాడు రిటైర్డ్ చీఫ్ ఫొటోగ్రాఫర్ సీ కేశవులు)తో కూడిన జ్యూరీ ఈ పోటీలకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. ఈ నెల 23న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్ విజయ్ కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల సంయుక్త ప్రకటనలో తెలిపారు. నమస్తే తెలంగాణకు చెందిన వీ రజనీకాంత్(హైదరాబాద్)కు ద్వితీయ, బందిగె గోపి (మహబూబ్‌నగర్)కు తృతీయ బహుమతులు దక్కాయి.