Hyderabad | హైదరాబాద్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ దాడులు కలకలం రేపాయి. నగరంలోని నలుగు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సూరానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
సూరానా గ్రూప్ ఆఫ్ కంపెనీతో పాటు దానికి అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నైలోని ప్రముఖ బ్యాంక్ నుంచి సురానా ఇటీవల వేల కోట్ల రుణం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.