హైదరాబాద్ : నగరంలోని చార్మినార్ చుట్టుపక్కల ఉన్న నాలుగు కమాన్లలో ఒకటైన కాళి కమాన్ సమీపంలో గల ఆక్రమణలను జీహెచ్ఎంసీ బుధవారం తొలగించింది. చార్ కమాన్, మచ్లీ కమాన్, షేర్-ఎ-బాటిల్ కమానంద్, కాళి కమాన్ ఈ నాలుగు తోరణాలు చార్మినార్కు ప్రవేశ ద్వారంగా ఉన్న సంగతి తెలిసిందే.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కాళి కమాన్ సమీపంలోని ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు. కమాన్ చారిత్రక ప్రాముఖ్యతను నిలిపేందుకు, పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు చెప్పారు.
Encroachments around Khaali kamaan (one of the char kamaans) being removed & the structure being restored to original by @GHMCOnline .. the third pic is how it will be after restoration @KTRTRS @Shrinisulge pic.twitter.com/TA5pkh9LpD
— Arvind Kumar (@arvindkumar_ias) May 26, 2021