ఎల్బీనగర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ మండల పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గంకు చెందిన కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు చెక్కులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేద ప్రజలకు ఆర్థిక బరోసా లభిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేదల కుటుంబాలకు పెండ్లీల భారం తగ్గిందన్నారు.
దేశంలోనే అత్యధికంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రతి కుటుంబం గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోతారన్నారు. ఈ సందర్భంగా 48 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.