హైదరాబాద్ : మాదాపూర్, బాలానగర్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా మాద్రక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 11 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. మాదక ద్రవ్యాల ముఠా నుంచి 45 కిలోల గంజాయి, 50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలపై గత రెండు నెలల నుంచి పోలీసులు నిఘా పెట్టిన విషయం విదితమే. ఈ రెండు నెలల కాలంలో 132 కేసులు నమోదు చేసి 257 మందిని అరెస్టు చేసినట్లు సీపీ రవీంద్ర పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కేసులో సంబంధం ఉన్న 8 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.