వేసవిలో విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి అన్నారు. శనివారం సికింద్రాబాద్ సర్కిల్ ప్యారడైజ్ డివిజన్ పరిధిలోని సీతాఫల్మండి సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 16ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను సీఎండీ స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు.
- నెట్వర్క్ బలోపేతానికే పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
- టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్
సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి అన్నారు. శనివారం సికింద్రాబాద్ సర్కిల్ ప్యారడైజ్ డివిజన్ పరిధిలోని సీతాఫల్మండి సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 16ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను సీఎండీ స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు.
విద్యుత్ నెట్వర్క్ బలోపేతం చేయడంలో భాగంగా దక్షిణ డిస్కం పరిధిలో కొత్త సబ్స్టేషన్లు, ఫీడర్లు, డీటీఆర్లు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉద్యోగులకు ముషారఫ్ సూచించారు. విద్యుత్ పనుల నిర్వహణలోనూ సిబ్బంది భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ డా.ఎన్ నరసింహులు, మెట్రోజోన్ సీఈ ప్రభాకర్, ఎస్ఈలు గోపయ్య, దిలీప్‌కుమార్, ఇతర ఇంజినీర్లు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

