e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home హైదరాబాద్‌ షాక్‌ల కాలం.. జరభద్రం

షాక్‌ల కాలం.. జరభద్రం

షాక్‌ల కాలం.. జరభద్రం

సిటీబ్యూరో, జూన్‌ 16 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలోనూ విద్యుత్‌ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ముందుస్తు అప్రమత్తతో అలాంటి వాటిని దూరం చేసుకునే అవకాశం ఉందని విద్యుత్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బయట విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తరచూ విద్యుత్‌ షాక్‌తో ప్రజలు ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్ని చోట్ల విద్యుత్‌ షాక్‌తో ప్రాణాలు పోతున్న సంఘటన చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసులు ఇంటా, బయటా విద్యుత్‌ షాక్‌తో అప్రతమత్తంగా ఉండాల్సి అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఇంటి నిర్మాణంలో ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ఇంటిని వెలుతురుతో ధగధగలాడించడంతో పాటు ప్రతి అవసరంలోనూ విద్యుత్‌ వినియోగం చాలా ముఖ్యం.

ఇందులో ఏమాత్రం ఆశ్రద్ద చూపినా జరిగే నష్టం ఊహించనంతగా ఉంటుంది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కోసం ఉపయోగించే పైపులు, తీగల నాణ్యత, నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగునంగా ఉందా లేదా అన్నది చాలా ముఖ్యం.విద్యుత్‌ పనులు చేయించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిపుణులైన ఎలక్ట్రిషియన్‌లను ఎంపిక చేసుకునే పనులు చేయించుకుంటే ప్రమాదాలను నివారిస్తుందని విద్యుత్‌ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇంటి వద్ద ఉండే కరెంటు స్థంభం వరకు విద్యుత్‌ లైను తీసుకువచ్చే బాధ్యత విద్యుత్‌ శాఖదైతే.

- Advertisement -

స్థంభం నుంచి ఇంట్లో మీటరకు వరకు, అక్కడి నుంచి ఇంట్లోని ప్రతి గదికి తీసుకువెళ్లే విద్యుత్‌ సరఫరాలో వాడే పైపులు, తీగల నాణ్యత మీద,వాటిని బిగించే విధానంపై పూర్తి బాధ్యత ఆయా ఇంటియజమానులే తీసుకోవాల్సి ఉంటుంది.

గృహ నిర్మాణ సమయంలో ఎలక్ట్రిక్‌ పనుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంట్లో ఉపయోగించే వివిధ ఎలక్ట్రిక్‌ పాయింట్ల మొత్తం లోడ్‌ను లెక్కించారో లేదో నిర్ధారించుకోవాలి. అదేవిధంగా వైరింగ్‌ కూడా ఇంట్లోని పలు ప్రదేశాల్లో ఉన్న ఎలక్ట్రిక్‌ పాయింట్‌ల నుంచి లోడ్‌ తీసుకుంటుందో లేదో చూసుకోవాలి. లోడ్‌ను ఏమాత్రం తట్టుకోలేని, సరైన నాణ్యత లేని వైర్లను ఉపయోగించినట్లయితే ఇది ఇంట్లో అగ్రి ప్రమాదాలకు దారి తీసి ప్రాణాలకు అపాయం కలిగించే ప్రమాదం ఉంది.

  • అన్ని రకాల ఎలక్ట్రికల్‌ వర్క్స్‌, ఫిట్టింగులు ప్రస్తుత భారతీయ విద్యుత్‌ చట్టాలు, నియమాలకు లోబడి ఉండాలి. ఎలక్ట్రికల్‌ ఫిట్టించుల్లో ఉపయోగించే అన్ని వస్తువుల ఐఎస్‌ఐ నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం తయారు చేశారో లేదో నిర్ధారించుకోవాలి.
  • ఆర్‌సీసీ స్లాబులు, గోడలకు పైపులు, జంక్షన్‌బా క్సులను ఫిట్టింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఏదైనా లోపం తలెత్తితే అది ఏదైనా ప్రమాదానికి కారణం కావొచ్చు. అందు వల్ల మళ్లీ ఆభాగాన్ని రిప్లేస్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహరం.
  • ప్రదాన కేంద్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్‌ బోర్డుల నుంచి వైర్ల ద్వారా విద్యుత్‌ ప్రవహిస్తూ ఉంటుంది. సాధ్యమై నంత వరకు అన్ని కండక్టర్లు, గోడలు, పైకప్పుల గుండా విద్యుత్‌ ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి సులభంగా ఉంటుంది.
  • లైట సర్యూట్‌లోని పాయింట్ల సంఖ్య 10కి మించకూ డదు. సర్యూట్‌ మొత్తం లోడ్‌ 800 వాట్స్‌ మించకూ డదు. ఒక సర్యూట్‌ నుంచి ఎలక్ట్రిక్‌ మీటర్‌ నుంచి మెయిన్‌ ఫ్యూజ్‌ వరకు ఒకటిగా చెప్పవచ్చు. పవర్‌ వైరింగ్‌ సర్క్యూట్‌ కోసం ఒక సర్యూట్‌లోని పాయిం ట్ల సంఖ్య2 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే వైపు 1.5 చదరపు మిల్లీమీటరు ఉండాలి.
  • స్విచ్‌ బోర్డులను గోడకు 1.5 మీటర్ల ఎత్తులో అమర్చాలి. వైరింగ్‌ దానికి క్షితిజ సమాంతరంగా 3 మీటర్ల ఎత్తులో ఉండాలి.
  • ఎర్త్‌ వైరు విషయానికి వస్తే ప్రతి ఒక్క సర్క్యూట్‌ తప్పకుండా ఉండాలి.ప్యూజ్‌ వైరును ఫేజ్‌ వైరుకు మాత్రమే కనెక్ట్‌ చేయాలి. న్యూట్రల్‌ లింకును న్యూట్రల్‌ వైరుతో కనెక్ట్‌ చేయాలి. అన్ని స్విచ్చులను ఫేజ్‌ వైరుకు కనెక్ట్‌ చేయాలి.

గుర్తింపు పొందిన ఎలక్ట్రికల్‌ నిపుణులతో పనులు చేయించుకోవాలి

ఇళ్లలో విద్యుత్‌ వినియోగం అత్యంత కీలకమైంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు, ఇంటర్‌నెట్‌ వినియోగం పెరగడంతో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీనికి వర్షాకాలంలో ప్రత్యేకంగా విద్యుత్‌ షాక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో వినియోగాన్ని తట్టుకునేలా ఆయా ఇళ్లలో ఏర్పాట్లు చేశారా లేదా అన్ని విషయాన్ని నిపుణులైన ఎలక్ట్రిషియన్లతో ఒకసారి తనిఖీ చేయించుకోవాలి. వారి సూచనల మేరకు ఇంట్లో విద్యుత్‌తో నడిచే ఉపకరణాలను వాడాలి. అవగాహన లేకుండా సొంతంగా మరమత్తులు చేసుకోరాదు. ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు ఏయే పాయింట్లలో వాడలా, అక్కడ దానికి అనుగుణంగా కేబుల్‌ వైరు సామర్థ్యం ఉందో లేదో చూసుకున్న తర్వాత వాడాలి. లేదంటే స్విచ్చ్‌ బోర్డుపై ప్రభావం చూపి, అవి కాలిపోయి షాక్‌ కొట్టే ప్రమాదం ఉంది. నక్కా యాదగిరి, తెలంగాణ ఎలక్ట్రికల్‌ లైసెన్స్‌ బోర్డు సభ్యులు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
షాక్‌ల కాలం.. జరభద్రం
షాక్‌ల కాలం.. జరభద్రం
షాక్‌ల కాలం.. జరభద్రం

ట్రెండింగ్‌

Advertisement