రామంతాపూర్, అక్టోబర్ 25 : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కో రుతున్నారు. అలాగే ప్రలు ప్రాంతాల్లో అభ్యర్థి బండారికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
ఇందులో భాగంగా బుధవారం నాచారం డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ, బాపూజీనగర్, సరస్వతీ కాలనీ, తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో నేతలు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిం చారు. సంవత్సర కాలంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ గురించి ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
బండారి లక్ష్మారెడ్డికి మద్దతు..
ఉప్పల్ లక్ష్మీనగర్ కాలనీలోని డైమండ్ ప్రింటింగ్ ప్రెస్‌ను ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి , రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డిలు బుధవారం సందర్శించి.. కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండారికి స్మాల్ స్కేల్ ఇండిస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ మద్దతు ప్రకటించారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్స్ కృష్ణ, విజయ్, శ్రీనివాస్, ఆదినారాయణ, వైజాగ్శీను, నాగేశ్వర్రావు, చంద్రమౌళి, శివారెడ్డి, రామకృష్ణ, జహాంగీర్, బీఆర్ఎస్ నాయకులు రాములు, రాజు, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్లో..
కాప్రా, అక్టోబర్ 25: కాప్రా డివిజన్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి జై కొడుతూ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ బస్తీలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంచు తూ బీఆర్ఎస్ జిందాబాద్, కారు గుర్తుకే మన ఓటు, బండారి లక్ష్మారెడ్డిని గెలింపించాలని నినాదాలు చేశారు. బస్తీలో ప్రతి ఇంటివారిని పలుకరిస్తూ, కారు గుర్తుకు ఓటేయాలని, బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో బైరి నవీన్‌గౌడ్, ఎన్.మహేశ్, బైరి భాస్కర్‌గౌడ్, ఇంద్రయ్య, కొప్పుల కుమార్, సోమ్‌నాథ్, మచ్చపాండు, వంశరాజ్ మల్లేశ్, చందు, భిక్షపతి, ఎండీ గౌస్, ఎండీ అలీ, గణేశ్, గిరుకబాయి సురేఖ, సరోజ, భాను, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ సాబేరా నగర్లో..
రామంతాపూర్, అక్టోబర్ 25 : ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం బుధవారం రామంతాపూర్ సాబేరా నగర్లో మైనార్టీ నేత జహంగీర్ ఆధ్వర్యంలో సమావేశమైనారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు పలు పథకాలు అమలవుతున్నాయన్నారు. కాలనీలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. పేదల అభివృద్ధికి బీఎల్ఆర్ ట్రస్టు కృషి చేస్తూ, చాలామందికి ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కేసీఆర్‌నగర్‌లో ఇంటిం టా ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ.. బీఎల్ఆర్ను భారీ మెజార్టీతో గెలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు నర్సింహారెడ్డి, ఫారుఖ్, అశ్వక్, బాల్‌రాజ్, సర్ఫ్రాజ్, హలిమా, షబానా, సత్తార్, రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.