Marijuana | చిక్కడపల్లి, ఫిబ్రవరి 15: గంజాయి తాగుతున్న ఎనిమిది మంది వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి గంజాయి, రెండు బైక్‌లు, తొమ్మిది సెల్ ఫోన్లు, రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపిన వివరాలు ప్రకారం బస్ భవన్ ముందు గల రోడ్డులో గంజాయి తాగడం కోసం పలువురు యువకులు గుంపుగా చేరారు. వారు గంజాయి కొనుగోలు చేస్తుండగా చిక్కడపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. వారిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ బీ రాజు నాయక్ మాట్లాడుతూ గంజాయి సేవిస్తున్న మహమ్మద్ సిద్ధిక్ ఖాన్ (23), మొహమ్మద్ షోయబ్ (25), పీకా జతిన్ (21), మొహమ్మద్ నాజర్ (20), మహ్మద్ సైఫ్ (21), పీక ఆర్య (19), మొహమ్మద్. ఫర్దీన్ (20), శెగ్గరి విఘ్నేష్ (26 ) లను అరెస్ట్ చేసి, రిమాండ్‌పై తరలించామన్నారు. ఎవరైనా గంజాయి, ఇతర డ్రగ్స్, సేవించినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.