బడంగ్‌పేట, ఏప్రిల్ 2 : ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయారు. అ ల్మాస్గౌడ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ చౌరస్తాలో ఉ న్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశా రు.
సంరెడ్డి వెంకట్‌రెడ్డి, రామిడి రాంరెడ్డి, ఏనుగు రాం రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి లు గజమాలతో మంత్రిని సత్కరించారు. ఈ సమావేశానికి సంరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మండి పడ్డారు. చెరువులను సుందరీకరిస్తుంటే కబ్జా లు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం మచి పద్ధతి కాదన్నారు. కోమటి కుంటను రూ. 2.50కోట్లుతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పోచ్చమ్మ కుంటను కోటి రూపాయలతో సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు.
అల్మాస్‌గూడలో ఇప్పటికే రూ.8కోట్లతో అభివృద్ధి చేయడం జ రిగిందన్నారు. తె లంగాణ రాష్ట్రం రా క ముందు అభివృద్ధి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పెను మార్పులు తీసుక రావడం జరిగిందని చెప్పారు. రోడ్ల విస్తరణకు రూ. 6 కోట్లు కెటాయించామని, ప్రజల అవసరాలను బట్టి ముఖ్య మంత్రి కేసీఆర్ చట్టాలను మార్పు చేసి ప్రజలకు మేలు చేస్తున్నాడని అన్నారు. అల్మాస్‌గూడలో ఉన్న గ్రీన్ జోన్ తొలగించడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు పోతానని ఆమె అన్నారు. 58,59 జీవో ద్వారా క్రమ బద్ధీకరణ చేయడం జరుగుతుందని, ఇప్పటికే లక్ష పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇంటి స్థలం ఉన్న వారికి మూడు లక్షలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వెయ్యి ఎకరాలలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామని, పచ్చని చెట్లు కాపాడాలన్న లక్ష్యంతో అడివి ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కొంత మంది తలా తోకలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. కేసీఆర్ నాయకత్వాని ప్రజలు బలపర్చాలని అన్నారు. 138 సర్వేనంబర్‌లో గతంలో ఇచ్చిన పట్టాలు ఇచ్చారని అన్నారు. ముఖ్య మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మల నరేందర్ గౌడ్, కార్పొరేటర్లు రామిడి కవి తా రాంరెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, ఏనుగు రాంరెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, సూర్ణ గంటి అర్జున్, చప్పిడి సంతోష్ రెడ్డి, కుంచ నాగేందర్, వాణి ఉన్నారు.