Early bird | సిటీబ్యూరో: ఎర్లీబర్డ్ స్కీంను యజమానులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. రూ. 800 కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా, బల్దియాకు రూ. 827 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 7,34,837 మంది సద్వినియోగం చేసుకుంటే.. అందులో శేరిలింగంపల్లి సర్కిల్ (మొదటి స్థానం)లో 58,512 మంది సద్వినియోగం చేసుకోగా, రూ.109.23 కోట్ల ఆదాయం వచ్చింది.
జూబ్లీహిల్స్ సర్కిల్ (రెండోస్థానం)లో 27,074 మంది నుంచి రూ. 8450.82 లక్షలు, ఖైరతాబాద్‌లో 30,849 మంది నుంచి రూ. 6903.51 లక్షలు వసూలైంది. అతి తక్కువగా చాంద్రాయణగుట్టలో కేవలం 6,270 మంది మాత్రమే ఎర్లీబర్డ్‌ను సద్వినియోగం చేసుకున్నారు.