Anganwadi Teacher | కందుకూరు, జూలై 7 : అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు లేకపోవడంతో టీచర్లే ఆయాలుగా మారుతున్నారు. ఆయాల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. దీంతో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన చేతులు వంట పాత్రలను శుభ్రం చేస్తున్నాయి. మండలంలో 69 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 12 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆయాలు లేకపోవడంతో అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆయాలు చేయాల్సిన పనులతో పాటు తమ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌గా ఆయాలను పెట్టుకోవాల్సి వస్తుందని, తమకు వచ్చిన వేతనాల నుంచి వారికి ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు ప్రభుత్వం వె ంటనే స్పందించి ఆయాలను తక్షణమే నియమించాలని కోరారు.