కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 28 : రవాణా శాఖలో హెల్ప్‌డెస్క్‌లను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. బుధవారం మేడ్చల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారుల పనివిధానంతో పాటు పలు రికార్డులను పరిశీలించారు.
త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులకు నోటీసులు జారీ చేయాలని, వాహనాల తనిఖీ అధికారులు ప్రతి నెల 5వ తేదీలో చెక్ రిపోర్ట్ నివేదికను అందించాలని సూచించారు. ఓవర్లోడ్లను అరికట్టడానికి ప్రత్యేక తనిఖీలు చేయాల్సిందిగా ఎంవీఐలను ఆదేశించారు. ఆయన వెంట మేడ్చల్ డీటీఓ రఘునందన్ గౌడ్, ఎంవీఐలు ప్రతాప్ రాజా, బాబు, శిల్ప, ఏఎంవీఐ త్రివేణిబాయి, ఏఓలు రామకృష్ణ, ఇప్తేకార్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.