హైదరాబాద్ : నగరంలో మందుబాబు రెచ్చిపోయారు. పీలక దాకా తాగి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. కళ్ల ఎదుట ఉందో? లేదో? తెలియకుండా మత్తులో మునిగి తేలుతూ కారును డ్రైవింగ్ చేస్తూ బషీర్బాగ్లో ఓ గోడను ఢీకొట్టారు. అయితే, ఆ తర్వాత మత్తు నుంచి తేరుకొని కారు దిగి చూసి షాక్కు గురయ్యారు. ఆ గేట్ సాక్షాత్తు ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయానికి. ఆ తర్వాత మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కారుతో ఢీకొట్టడంతో కార్యాలయం గోడ
స్వల్పంగా దెబ్బతినగా.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇష్టారాజ్యంగా తాగుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.